Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

నైజాంలో సినిమా రిలీజ్‌ అంటే తొలుత వినిపించే పంపిణీదారు పేరు దిల్‌ రాజు. చాలా ఏళ్లుగా ఆయన ఇక్కడ ఏకఛత్రాదిప్యతం చూపిస్తూ వచ్చారు. ఏసియన్‌ సునీల్‌, అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, వరంగల్‌ శ్రీను లాంటి వాళ్లు నైజాం ఏరియాలో సినిమాల విడుదల చేసినా దిల్‌ రాజుకు మాత్రం అంత పోటీ ఇవ్వలేకపోయారు. ఒకవేళ పోటీ ఇచ్చినా దిల్‌ రాజు హవా సాగుతూనే వచ్చింది. ఈ క్రమంలో ఆయన మీద నమ్మకం ఉంచుతూ నిర్మాతలు సినిమాలు ఇచ్చారు. ఈ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ వచ్చి పోటీ ఇవ్వడం ప్రారంభించింది.

Annapurna Studios

ఇదీ ఇప్పటివరకు నైజాం ఏరియాలో జరిగిన, జరుగుతున్న విషయం. ఇప్పుడు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్‌ గేమ్‌ మారబోతోంది. ఎందుకంటే ఇక్కడ పంపిణీలోకి అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌ వచ్చేసింది. విశ్వక్‌సేన్‌ – అనుదీప్‌ – కయాదు లోహర్‌ కాంబినేషన్‌లో నాగవంశీ నిర్మించిన సినిమా ‘ఫంకీ’ని ఎప్పుడూ ఆయన సినిమాలు ఇచ్చే దిల్‌ రాజుకు కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌ టీమ్‌కి ఇచ్చారు. దిల్‌ రాజు, నాగవంశీ మధ్య ఉన్న బంధం ఈ సినిమాతో తెగిపోయినట్లే అని చెబుతున్నారు.

ఆయనే కాదు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సాహు గారపాటి, భోగవల్లి బాపినీడు, సతీష్ కిలారు లాంటి వాళ్లు కూడా అన్నపూర్ణతో కలుస్తున్నారు అని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. వీటితోపాటు అక్కినేని కుటుంబ హీరోలు చేసే సినిమాలు ఎలాగూ అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారానే విడుదల అవుతాయి. అలా ఈ కంపెనీ పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని అర్థమవుతోంది. దీనిని నిర్మాత సుప్రియ హ్యాండిల్‌ చేస్తారు అని సమాచారం. ‘ఫంకీ’ రిలీజ్‌ అయ్యాక ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

అయితే, టాలీవుడ్‌ పెద్ద నిర్మాణ సంస్థలు, హీరోలతో దిల్‌ రాజుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎల్‌ఎల్‌పీ నిర్మాతల గ్రూపులోనూ దిల్‌ రాజుతోపాటు పైన చెప్పిన నిర్మాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎల్‌ఎల్‌పీ గ్రూపు పరిస్థితి ఏంటి అనేది కూడా త్వరలో తేలుతుంది.

పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus