మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూతో అది సాధ్యం కావడం లేదు. దీంతో కొన్నాళ్ళ పాటు వేచి చూడాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పూర్తయ్యాక మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ ను రీమేక్ చెయ్యడానికి చిరు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని ‘సాహో’ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయనున్నాడు. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుజీత్. ఇక ఈ మధ్య తనకు పెళ్లి సెట్ అవ్వడంతో కాస్త బ్రేక్ తీసుకున్నట్టు వినికిడి. ఇదిలా ఉంటే.. ‘లూసిఫర్’ లో మోహన్ లాల్ పాత్రకు ఓ చెల్లెలి పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో మంజు వారియర్ నటించింది. అయితే తెలుగులో మాత్రం సుహాసిని ని అనుకుంటున్నారట. మొదట్లో విజయ్ శాంతిని ఈ పాత్రకు తీసుకోవాలి అనుకున్నారట.
కానీ ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత ‘సరైన కథ.. అందులోనూ తనకు నచ్చిన పాత్ర అయితేనే చేస్తాను.. ఇలాంటి పాత్రలు చెయ్యను’ అంటూ తేల్చి చెప్పేసిందట. అందుకే సుహాసినిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే విజయశాంతి, సుహాసిని.. ఇద్దరూ కూడా చిరంజీవి సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళను చెల్లెలి పాత్రలో చూడాలి అనుకున్నా.. ఇబ్బందిగా ఉంటుందేమో..! అలాంటి పాత్రకు ఏ అనసూయనో తీసుకుంటే బెటర్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!