Family Star: విజయ్ దేవరకొండ సినిమాలో ఇంకో హీరోయిన్.. మేటర్ ఏంటి?

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), దర్శకుడు ప‌ర‌శురామ్ (Parasuram) పెట్ల కాంబినేషన్లో (Geetha Govindam) ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపుదిద్దుకొంటున్న చిత్రం (Family Star) ‘ఫ్యామిలీ స్టార్‌’. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. 2 రోజుల క్రితం టీజ‌ర్ వదిలారు. విజయ్ దేవరకొండని మాస్ గా చూపిస్తూనే కొంచెం ఫ్యామిలీ టచ్ కూడా ఇచ్చారు ఆ టీజర్ కి.! మరోపక్క నంద నందన సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. యూట్యూబ్ లో ఆ పాట హల్ చల్ చేస్తుంది.

ఈ నెలాఖరుకి ట్రైల‌ర్ ను కూడా వదిలే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో విజ‌య్ దేవరకొండ స‌ర‌స‌న (Mrunal Thakur) మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లో ఆమె కూడా స్పెషల్ గా కనిపించింది. టీజర్ చివర్లో ఆమె పలికే డైలాగ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట.

ఆమె మరెవరో కాదు (Divyansha Kaushik) దివ్యాంశ కౌశిక్‌. (Majili) ‘మ‌జిలీ’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దివ్యాంశ‌.. తర్వాత (Ramarao on Duty) ‘రామారావు ఆన్ డ్యూటీ’, (Michel) ‘మైఖెల్’, ‘టక్కర్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్లో’కూడా ఆమె నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలా అని ఇందులో ఆమె హీరోయిన్ కాదు.. ఓ ముఖ్య పాత్ర మాత్రమే పోషిస్తున్నట్టు సమాచారం. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఓ పాటలో (Rashmika Mandanna) ర‌ష్మిక కూడా మెరిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus