2024.. ఎవరికి ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియదు కానీ.. మంచు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో మాత్రం చాలా గొడవలు చూసింది. ఊహించని విషయాల్లో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. వారి వల్ల ఇతరులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయం పక్కనపెడితే.. ఏడాది ఆఖరున ఆ కుటుంబం మీద మరో కాంట్రవర్శీ వచ్చి పడింది. అదే అడవి పందుల వేట. అవును ఇదో కొత్త కేసు మంచు కుటుంబం ఇంట పడింది.
అనుచరులు చేసిన పని వల్ల మంచు విష్ణు (Manchu Vishnu) ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. జల్‌పల్లిలోని మంచు నగర్‌కి దగ్గర్లో ఉన్న అడవిలో విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడం చర్చనీశమైంది. ఆ చిట్ట అడవిలోకి విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వెళ్లి అడవి పందిని వేటాడి బంధించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విష్ణు అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు స్థానికులు.
ఇప్పటికే జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబును అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj) వ్యవహారంలో వరుస కంప్లయింట్‌లు కూడా వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విష్ణు అనుచరులు ఇలా అడవి పందుల్ని వేటాడటం ఇబ్బందుల్ని పెంచేలా మారింది. మంచు ఫ్యామిలీలో వివాదాల నేపథ్యంలో మంచు విష్ణు – మంచు మనోజ్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. అప్పటి నుండి వారు ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకుంటున్నారు.
ఈ సమయంలో విష్ణు సిబ్బంది అడవి పందుల వేట వల్ల ఆయన ఈ కేసులో చిక్కుకుంటారేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ కేసు అనుచరుల వరకే ఉంటుందని అనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వేట వీడియోలు ఇప్పుడు ఎందుకు, ఎలా బయటకు వచ్చాయి అనేది కూడా ఇక్క ఆసక్తికరంగా మారింది. అక్కడ నెమళ్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయి అని కూడా అంటున్నారు. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న దృశ్యాలు తమ దాకా వచ్చాయని, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.