Akhanda movie: ‘అఖండ’లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్!

  • June 5, 2021 / 04:25 PM IST

నందమూరి బాలకృష్ణకు పురాణ ఇతిహాసాలపై మంచి పట్టు ఉందనే సంగతి తెలిసిందే. తన సినిమా ఈవెంట్స్ లో, బయట ఫంక్షన్స్ లో రామాయణ మహాభారతాల గురించి చెబుతుంటారు. శ్లోకాలు కూడా పాడుతుంటారు. గుక్క తిప్పుకోకుండా ఆయన సంస్కృతి శ్లోకాలు చెబుతుంటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పుడు తన టాలెంట్ ను వెండితెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు.

ఇందులో అఘోరా గెటప్ ఒకటి. ఇటీవలే అఘోరా గెటప్ కి సంబంధించిన చిన్న టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. సినిమాలో కూడా ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. దాదాపు సినిమాలో ఈ పాత్ర పలికే సంభాషణలన్నీ కూడా సంస్క్రృత శ్లోకాలే అని సమాచారం. వాటిని బాలయ్య పాట రూపంలో కూడా పాడారని సమాచారం. అయితే ఆ శ్లోకాలను సందర్భానుసారంగా వాడారని..

వాటి అర్ధాన్ని సైతం విడమరిచి చెబుతారని టాక్. అఘోరా పాత్ర అయినప్పటికీ దాన్ని బాలయ్య స్వభావానికి తగ్గట్లుగా దర్శకుడు మలచడంతో ఆయన నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus