రష్మిక-శ్రీలీలను మించిపోయే అందం..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీలదే హవా అయిపోయింది . మరి ముఖ్యంగా కృతిశెట్టి – రష్మిక మందన్నా – శ్రీ లీల ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోనే వాళ్లకు కాంపిటీషన్ ఇస్తూ మరో కన్నడ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి రాబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి .రీసెంట్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించిన సినిమా “సప్త సాగరాలు దాటి ఎల్లో”..

ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ అయింది . తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే అమ్మడు పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో హీరో రక్షిత్ శెట్టి డామినేట్ చేసే విధంగా ఆమె నటించింది అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ పేరు నెట్టింట వైరల్ గా మారింది .

అంతేకాదు ఇప్పటివరకు ఆమె నటించింది మూడంటే మూడు సినిమాలే ..అయినా సరే టాప్ హీరోయిన్ రేంజ్ లో మించిపోతుంది . ఒకవేళ ఇదే కొనసాగితే త్వరలోనే అమ్మడు కూడా తెలుగులో అవకాశాలు దక్కించుకొని రష్మిక మందన్నా – శ్రీలీల ను మించి పోయే రేంజ్ లో ముందుకెళ్ళిపోతది అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి ఈ కన్నడ బ్యూటీ ఎలా మెప్పిస్తుందో..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus