‘ఆర్.ఆర్.ఆర్’ టీజర్ : మరో రికార్డు కొట్టిన ‘రామరాజు ఫర్ భీమ్’..!

రాజమౌళి డైరెక్షన్లో ‘బాహుబలి'(సిరీస్) తరువాత రాబోతున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయనే చెప్పాలి. చరణ్ పుట్టినరోజున అల్లూరి గెటప్ లో అతని పాత్రను పరిచయం చేస్తూ ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేసాడు జక్కన్న. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు మాత్రం అలాంటి టీజర్ విడుదల కాలేదు.

లాక్ డౌన్ వల్ల ఎడిటింగ్ టీం ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం వల్లనే ‘భీమ్’ టీజర్ ను విడుదల చేయలేకపోతున్నామని అప్పుడు జక్కన్న తెలిపాడు. ఎట్టకేలకు అక్టోబర్ 22న ‘రామరాజు ఫర్ భీమ్’ ను విడుదల చేశారు. కాస్త లేటయినప్పటికీ.. భీమ్ టీజర్ అద్భుతంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు. అంతేకాదు ఎవ్వరూ ఊహించని రికార్డులు కూడా భీమ్ టీజర్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో 1 మిలియన్ లైకులను సాధించిన టీజర్ గా ఇప్పటికే ఓ రికార్డుని తన ఖాతాలో వేసుకున్న భీమ్ టీజర్..

ఇప్పుడు మరో రికార్డుని కూడా సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ కు ఇప్పటికే లక్షకు పైనే కామెంట్లు నమోదయ్యాయట. టాలీవుడ్లో ఇప్పటివరకూ ఏ టీజర్ కు ఇన్ని కామెంట్లు నమోదు కాలేదట. ఈ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి టీజర్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డులకెక్కాడు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus