‘యూరి : ది సర్జికల్ స్ట్రైక్ … రికార్డులు ఆగట్లేదుగా..!

బాలీవుడ్ ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన చిత్రం ‘యూరి : ది సర్జికల్ స్ట్రైక్ ‘సంజు’ ఫేమ్ విక్కీ కౌషల్ హీరోగా యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 2016 వ సంవత్సరంలో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను ఆధారంగా చేసుకొని రూపొందింది. జనవరి 11 న విడుదలైన ఈ చిత్రం 240 కోట్ల కలెక్షన్లను రాబట్టి ‘ఆల్ టైం బ్లాక్ బ్లాస్టర్’ హిట్స్ లిస్ట్ లో చేరింది. ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కేవలం 45 కోట్ల బడ్జెట్ రూపొందింది.

తాజాగా ఈ చిత్రాన్ని కర్ణాటక లో కూడా విడుదలచేయగా… అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది. ఇప్పటివరకూ అక్కడ 25 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికి అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ చిత్రం రన్ అవుతుందట. ఇప్పటి వరకూ అక్కడ ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం భారీ వసూళ్ళను సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో నిలువగా… ఆ తరువాతి స్థానంలో ‘యూరి : ది సర్జికల్ స్ట్రైక్ నిలువడం విశేషం. ఈ చిత్రాన్ని ‘ఆర్.ఎస్.వి.పి’ బ్యానర్ పై రోనీ స్క్రివెలా నిర్మించిన ఈ చిత్రం ముందు ముందు ఇంకెన్ని రికార్డులు నమోదుచేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus