Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

నటన పై వ్యామోహం ఎక్కువగా ఉంటే.. దాన్ని వదిలి ఎవరైనా ఎందుకు ఉంటారు? ఎన్నాళ్లని దూరంగా ఉంటారు? ఎప్పుడో ఒకప్పుడు కెమెరా ముందుకు రావాలని పరితపిస్తూనే ఉంటారు. సరిగ్గా 2025లో ఇదే జరిగింది. ఒకప్పుడు వెండితెరపై తమ సత్తా చాటిన తారలు, సుదీర్ఘ విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. ఈ ఏడాది అలా మెరిసిన ఒకప్పటి తారలు ఎవరో? వాళ్ళు ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారో? ఆ సినిమాల ఫలితాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

Star actors who made re-entry into the Film Industry in 2025

1) నందమూరి కళ్యాణ్ చక్రవర్తి:

1980లలో హీరోగా ఒక వెలుగు వెలిగిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, దాదాపు 30 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మేకప్ వేసుకున్నారు. రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ మూవీలో రాజి రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేకంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పర్వాలేదన్నట్టు పెర్ఫార్మ్ చేస్తుంది.

2) శ్రీదేవి విజయ్‌కుమార్:

ప్రభాస్ ‘ఈశ్వర్’ తో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన అలనాటి అందాల తార, సీనియర్ నటి మంజుల కూతురు అయిన శ్రీదేవి.. నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ తల్లి వైష్ణవి అనే మధ్య వయస్కురాలి పాత్రలో నటించి, తన అందంతో, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

3) లయ:

‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్ హిట్ సినిమాల్లో నటించిన లయ.. దాదాపు 14 ఏళ్ల తర్వాత నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సర్వైవల్ యాక్షన్ డ్రామాలో నితిన్ అక్కగా నటించి, సిస్టర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథంతా ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె నటన కూడా హైలెట్ గా నిలిచింది.

4) జెనీలియా:

టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ క్రేజ్ ఉన్న జెనీలియా, 13 ఏళ్ల తర్వాత ‘జూనియర్’ అనే సినిమాతో తెలుగు తెరపై మెరిశారు. కిరీటి రెడ్డి, శ్రీలీల నటించిన ఈ సినిమాలో జెనీలియాకీ రోల్ ప్లే చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది.

5 ) అన్షు:

‘మన్మథుడు’లో నాగార్జున పక్కన నటించిన అన్షు గుర్తుందా? ఆమె దాదాపు 22 ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ మూవీ ‘మజాకా’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె మిడిల్ ఏజ్డ్ బ్యూటీగా లీడ్ రోల్ పోషించడం విశేషం. ఈ సినిమాలో ఆమె రోల్ చాలా కీలకంగా ఉంటుంది.

6) అనితా హస్సానందని:

‘నువ్వు నేను’ ఫేమ్ అనిత 20 ఏళ్ల తర్వాత సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె మదర్ రోల్ ప్లే చేశారు.ఆమె బాగానే చేసింది కానీ సినిమా అయితే ఆడలేదు.

7) కామ్నా జెఠ్మలానీ:

‘రణం’ వంటి సినిమాల్లో నటించి అలరించిన ఈమె.. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బాగానే ఆడింది.. కానీ ఈమె పాత్రకి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం డిజప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇలాంటి పాత్రలు ఆమెకు కలిసి రావు కదా.

8) విజయశాంతి:

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ ఏడాది కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’లో పవర్ ఫుల్ రోల్లో నటించి రీ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ సినిమా మాత్రం ఆడలేదు.

9) సింధు తులానీ:

ఒకప్పుడు గౌతమ్ ఎస్ ఎస్ సి వంటి హిట్ సినిమాలతో అలరించిన ఈమె..కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె మేకోవర్ కూడా బాగా సెట్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

10) కీర్తి చావ్లా:

విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ విషయం పెద్దగా హైలెట్ అవ్వలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus