పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్లో ‘ది రాజాసాబ్'(RajaSaab) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, ట్రైలర్, 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఇందులో టీజర్ మినహా ఏదీ కూడా ఆకట్టుకోలేదు. అందుకే సినిమాపై బజ్ లేదు. అయినప్పటికీ ప్రభాస్ సినిమా కాబట్టి.. కచ్చితంగా ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది.
సంక్రాంతికి ఫస్ట్ ఆప్షన్ కూడా ఈ సినిమానే అనడంలో సందేహం లేదు. అయితే బజ్ అనేది ఓపెనింగ్స్ కి ముఖ్యం కాబట్టి.. మేకర్స్ దానిపై కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా ‘ది రాజాసాబ్’ నుండి మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది కూడా 3 నిమిషాల 11 సెకన్ల నిడివి కలిగి ఉంటుంది. ఈ ట్రైలర్లో కథ పై హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హీరో తాత.. నానమ్మని ప్రేరేపించి.. తన సంస్థానానికి హీరోని రప్పించడం, అటు తర్వాత అతన్ని వేధించడం, దాన్ని మనవడు ఎలా తట్టుకుని నిలబడ్డాడు. ఎలా అతని తాతని జయించాడు. ఈ క్రమంలో ఎదురైన సమస్యలతో అతను ఎలా పోరాడాడు? అనేది సినిమా మెయిన్ ప్లాట్ గా తెలుస్తుంది.
అలాగే తాత.. మనవడు అయినటువంటి ప్రభాస్ ని ఆవహించడం.. ఈ క్రమంలో అతని ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ 3 రకాల లుక్స్ లో కనిపించబోతున్నాడు. టెక్నికల్ టీం అంతా ఈ సినిమాకి బాగా పనిచేశారు అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :