కొన్నాళ్ళుగా టాలీవుడ్లో విడాకుల సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. నాగ చైతన్య- సమంత జంట విడాకులు ప్రకటించగానే అంతా షాక్ అయ్యారు. ఆ షాక్ నుండీ జనాలు పూర్తిగా కోలుకోకుండానే రజినీ కాంత్ కుటుంబంలో ధనుష్- ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం మరింత చర్చనీయాంశం అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో కూతురు కూడా విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉంది.
ఆమెకిది రెండో పెళ్ళి కాగా.. ఇది కూడా విడాకుల బాట పట్టడం మొన్నటికి మొన్న పెద్ద చర్చనీయాంశం అయ్యింది.ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకుల బాట పట్టనుంది. వివరాల్లోకి వెళితే… కొన్ని సంవత్సరాల క్రితం ఓ యూత్ ఫుల్ కాలేజీ మల్టీస్టారర్ లో ఓ పాత్ర పోషించి, తర్వాత సోలో హీరోగా నిలదొక్కుకుని హిట్లు అందుకుని తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్న యంగ్ హీరో. 2020 లాక్ డౌన్ టైములో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు.
ఏడాది పాటు ఈ జంట బాగానే కలిసుంది. కానీ తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలంగా వీళ్ళు సెపరేట్ గా ఉంటున్నారు. వీళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇవి చిన్న చిన్న గొడవలే, తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని లైట్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఆశించినట్టు జరగలేదు. పైగా ఈ మధ్యనే వీళ్ళు విడాకులకు అప్లై చేసినట్టు సమాచారం. త్వరలోనే వీళ్ళ విడాకుల మేటర్ అధికారికంగా ప్రకటించాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!