ఫ్యాషన్ అప్టేడ్ గురించి ఆసక్తికార విషయాలు చెప్పిన అను

అమెరికాలో పుట్టి పెరిగిన బ్యూటీ అను ఇమ్యానుయేల్… మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది . త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా నటించింది. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా చేసింది. ఈ రెండు చిత్రాలు తనకి మంచి పేరు తెచ్చిపెడుతాయనుకుంటే .. ఫలితం రివర్స్ అయింది. ఇప్పుడు ఆశలన్నీ శైలజా రెడ్డి అల్లుడు పైనే పెట్టుకుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది. అక్కినేని హీరో అయినా తన కెరీర్ ని మలుపు తిప్పుతాడని భావిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న అను బ్రేక్ సమయంలో మీడియాతో ముచ్చటించింది.

ఫ్యాషన్‌ అప్‌డేట్‌ గురించి ఆసక్తికరమైన అంశాలను వివరించింది. ‘‘అందరికీ అన్ని రకాల వస్త్రాలు సూట్‌ కావు. కానీ కొందరికి కొన్ని చాలా బాగా నప్పుతాయి. నా చిన్నతనంలో మాధురీ దీక్షిత్‌, శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్లు ఎప్పుడూ నాకు కొత్తగానే కనిపించేవారు. అలాగే ఈ మధ్య సమంతను చూసి ఫిదా అయ్యా. ఫ్యాషన్‌ పరంగా నాతో పాటు ఉన్న వారికన్నా కాస్త ముందు ఉండాలని అనుకుంటా. అందుకే నా ఫోన్‌లో ఎప్పుడూ పిన్‌ట్రెస్ట్‌ యాప్‌ పెట్టుకున్నా. ఫుడ్‌ నుంచి ఫ్యాషన్‌ వరకు ప్రతిదీ అందులో ఉంటుంది. ఎప్పుడైనా ఏమీ తోచకపోతే నేను ఆ యాప్‌ని ఓపెన్‌ చేస్తాను. అలా చూస్తూ ఉంటే, నా మనసులో ఆలోచనలు మొదలవుతాయి. అసలు థాట్స్‌ ఆగవు’’ అని చెప్పింది. చైతూ తో నటిస్తున్న సమయంలో అతని భార్య సమంతని అభినందించడంలో ఏదో మర్మమే దాగి ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus