కోలీవుడ్ స్టార్ హీరో సరసన అనూ ఇమ్మాన్యూయల్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అనూ ఇమ్మాన్యూయల్. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి. రాజ్ తరుణ్ తో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం కూడా పర్వాలేదనిపించడంతో వెంటనే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత తమిళ్ లో విశాల్ తో కూడా ఓ చిత్రంలో నటించింది.

వీటితో పాటూ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ చిత్రాలన్నీ ప్లాపవ్వడంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. మరోసారి అదృష్టం పరీక్షించుకుందామని నాగచైతన్య- మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం చేసింది. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది తప్ప హిట్టయితే కాలేదు. ఇక బ్లాక్ బస్టర్ చిత్రం ‘గీత గోవిందం’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసినా ఈ అమ్మడికి పేరు రాలేదు. అటుతరువాత ఈ అమ్మడికి ఛాన్సులు ఏమీ రాలేదు. కానీ తాజాగా ఈ బ్యూటీ కి ఓ భారీ ఆఫర్ దక్కిందట. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ భారీ చిత్రానికి సంతకం చేసింది అనూ. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ చిత్రంతో అయినా అనూ ఇమ్మాన్యూయల్ దశ తిరుగుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus