‘టైగర్‌..’ మాస్‌ బ్యూటీ ఎవరో తెలుసా? తమిళంలో నటించినామెనే!

  • October 2, 2023 / 06:10 PM IST

రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అవతారంలో త్వరలో బాక్సాఫీసు దగ్గర సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రచారం కన్నా… ఈ సినిమా గురించి కేసులు, గొడవలే, పంచాయితీలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ కాస్త సమసిపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో టీమ్‌ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నా కథానాయిక పాత్రను పరిచయం చేసింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అని ఇన్నాళ్లుగా చెప్పుకొచ్చారు.

సినిమా టీమ్‌ నుండి వచ్చిన సమాచారంలో కూడా వీళ్ల పేర్లనే హైలైట్‌ చేశారు. అయితే ఇప్పుడు మరొక లేడీ లుక్ విడుదల చేశారు. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ మాజీ మిస్‌ ఇండియా కూడా. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా… అనుకీర్తి వ్యాస్‌. సినిమాలో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. తెలుగులో అనుకీర్తికి ఇది తొలి చిత్రం కాగా, తమిళంలో ఇప్పటికే ఓ సినిమా చేసింది. విజయ్ సేతుపతి హీరోగా ‘డీఎస్పీ’ అనే సినిమాలో నటించింది.

అంతకుముందు అంటే 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఇన్నాళ్లకు తెలుగులో సినిమా చేస్తోంది. తమిళ కథానాయికలా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అనుకీర్తికి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు. ఇక ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సంగతి చూస్తే… ‘‘నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే… వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే… వాడి పరువుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే… వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు.

దురదృష్టవశాత్తూ వాడు క్రిమినల్ అయ్యాడు’’ అని టీజర్లో చెప్పించారు. అంతలా ఆ పాత్ర మీద, సినిమా మీద అంచనాలు పెంచేసింది టీమ్‌. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’, ‘ధమాకా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆ నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు కగా, అక్టోబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో స్టూవర్టుపురం నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 20న సినిమాను విడుదల చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus