Anupama: ‘టిల్లు స్క్వేర్’ లోని లిప్ లాక్ సీన్స్ పై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కెరీర్ ప్రారంభం నుండి డీసెంట్ రోల్స్ అంటే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే చేస్తూ వస్తోంది. కానీ ఈ మధ్య తన పంధా మార్చుకున్నట్టు అందరికీ ‘రౌడీ బాయ్స్’ చూశాక అనిపించింది. అయితే ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చూశాక ‘అది నిజమే’ అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. ‘అసలు అనుపమ ఒక్కసారిగా ఇలా బోల్డ్ గా మారిపోవడానికి గల కారణాలు ఏంటి?’ అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. తాజాగా ఈ డౌట్స్ కి క్లారిటీ ఇచ్చేసింది అనుపమ.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “కొన్నాళ్లుగా నేను చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ కలిగింది. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం కంఫర్ట్ గా ఉన్న బట్టలు మాత్రమే వేసుకుంటూ ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నచ్చుతుందా లేదా అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. అలాగే నేను చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మీకు కూడా బోర్ కలుగుతుంది. ఇలాంటి టైంలో నాకు లిల్లీ అనే పాత్ర వచ్చింది.

ఇది మిస్ చేసుకుంటే నా అంత స్టుపిడ్ పర్సన్ ఇంకొకరు ఉండరు. చాలా మంచి పాత్ర ఇది నేను రాసిస్తా? అలా అని ఇక నుండి ఇలాంటి పాత్రలే చేస్తాను అని చెప్పడం లేదు. ‘బిర్యానీ అంటే ఇష్టం కదా.. అని రోజూ బిర్యానీనే తినం కదా..! నాకు అన్నీ కావాలి. బిర్యానీ, పులిహోర.. ఇలా అన్నీ కావాలి(నవ్వుతూ)” అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus