Anupama, Rajamouli: జక్కన్న సినిమాలో ఛాన్స్ కావాలంటున్న అనుపమ.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో నటించినా తిరుగులేదని చాలామంది నటీనటులు భావిస్తారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఆశిస్తున్న హీరోయిన్ల జాబితాలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తాజాగా ఒక సందర్భంలో అనుపమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఈ బ్యూటీ ఆశపడుతున్నారు.

జక్కన్న సినిమాలో ఛాన్స్ కావాలని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తిరుపతిలో సందడి చేశారు. ఒక వస్త్ర దుకాణం మొదటి వార్షికోత్సవానికి అనుపమ హాజరయ్యారు. ఆ తర్వాత అనుపమ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన టిల్లు స్క్వేర్, ఈగల్ సినిమాలు త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్నాయని ఆమె పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఛాన్స్ ఇస్తే పరుగెత్తుకుంటూ వెళ్తానని అనుపమ తెలిపారు.

బన్నీకి జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అనుపమ చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తానని ఆమె అన్నారు. తమిళం, మలయాళ భాషలలో కూడా నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిందని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. జక్కన్న రాబోయే రోజుల్లో అనుపమకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

అనుపమకు (Anupama) సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న అనుపమ బాక్సఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి. అనుపమ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. అనుపమ భారీ సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో కూడా అనుపమ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus