‘ప్రేమమ్’ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, తన కెరీర్‌ను దెబ్బతీసిన ఓ పెద్ద వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పింది. రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ విషయంలో తనపై వచ్చిన తప్పుడు ప్రచారం వల్ల ‘6 నెలల పాటు నరకం చూశానని, అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది అని’ ఆమె చెప్పి అందరికీ షాకిచ్చింది.
‘పరదా’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, “‘రంగస్థలం’ కోసం దర్శకులు సుకుమార్ గారు నన్ను సంప్రదించారు. నేను ఆ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. కానీ చివరి నిమిషంలో నన్ను తప్పించి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. అసలు నిజం ఇది. కానీ నేను ‘రంగస్థలం’ సినిమాని రిజెక్ట్ చేశాను’ అంటూ ప్రచారం జరిగింది.
దీంతో ‘అనుపమకి ఆటిట్యూడ్ ఎక్కువైంది.! ఏకంగా చరణ్ సినిమానే రిజెక్ట్ చేసింది’ అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.ఆ ప్రచారం వల్ల, నాకు 6 నెలల పాటు ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. రంగస్థలం కోసం కూడా నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఇదంతా జనాలకు తెలీదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ.
2018లో విడుదలైన ‘రంగస్థలం’ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఆమె నటనకి కూడా ప్రశంసలు దక్కాయి. ఒకవేళ ఆ సినిమాలో అనుపమ నటించి ఉంటే, ఆమె కెరీర్ గ్రాఫ్ మరో స్థాయిలో ఉండేది. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని, టాలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగేది. ఇప్పుడు అనుపమ చేసిన వ్యాఖ్యలతో ఈ టాపిక్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.