దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో మరోసారి వార్తల్లో నిలిచారు. తన భర్త జ్ఞాపకాలతో జీవిస్తున్న ఆమె, తరచూ ఎమోషనల్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన సున్నితమైన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఘాటు సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆమెకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. “మిమ్మల్ని వాళ్లు (నందమూరి కుటుంబం) కలవరు కదా, అయినా ‘మా ఫ్యామిలీ’ అని ఎందుకు అంటుంటారు?” అని ఓ నెటిజన్ సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని పసిగట్టిన అలేఖ్య, ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చారు.
అలేఖ్య స్పందిస్తూ.. “వాళ్లు కలిసినా, కలవకపోయినా… మాట్లాడినా, మాట్లాడకపోయినా… మమ్మల్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా.. ఏ ఫ్యాక్ట్ మారదు. నందమూరి కుటుంబం నాది, మాది” అంటూ కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. ఈ ఒక్క సమాధానంతో ఆమె తన కుటుంబంపై ఉన్న గౌరవాన్ని, బంధాన్ని ఎంత బలంగా నమ్ముతున్నారో స్పష్టం చేసింది.తారకరత్న 2023, ఫిబ్రవరిలో గుండెపోటుతో పోరాడి మరణించినప్పటి నుంచి అలేఖ్య తన ముగ్గురు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన భర్త జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. కుటుంబం గురించి వచ్చిన ఈ ప్రశ్నకు ఆమె చూపిన ధైర్యం, ఇచ్చిన సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘అమరావతి’లో విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు తారకరత్న, నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరు ఆసుపత్రిలో 23 రోజుల పాటు చావుతో పోరాడి ఓడిపోయారు.కేవలం 39 ఏళ్ల వయసులోనే అతను మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది.