రెండు వారాలే బతుకుతానని చెప్పారు: అనురాగ్ బసు

‘బర్ఫీ’, ‘లూడో’, ‘జగ్గా జసూస్’ లాంటి సినిమాలకు దర్శకుడిగా పని చేశారు అనురాగ్ బసు. 2004లో ఆయన బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. అతడిని పరీక్షించిన డాక్టర్స్ కేవలం రెండు వారాలు మాత్రమే బతుకుతారని చెప్పారట. ఆ సమయంలో అతడి భార్య ఏడు నెలల గర్భిణి. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఓసారి నోటి నిండా పొక్కులు వచ్చాయి. కానీ ఆరోజు షూటింగ్ ఉండడంతో నేరుగా సెట్స్ కి వెళ్లాను. కానీ మహేష్ భట్ మాత్రం ఈరోజు షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి వెళ్లిపో అన్నారు. సాధారణంగా అతడు ఎప్పుడూ అలా చెప్పరు. ఆ తరువాత హాస్పిటల్ లో చెకప్ చేయించుకున్నాను. అప్పుడు మా పేరెంట్స్ ముఖం చూశాక ఏదో చేదు జరుగుతుందనిపించింది. క్యాన్సర్ అని బయటపడింది.

మొదట్లో కొంచెం తలనొప్పితో పాటు నీరసంగా అనిపించేది. అయినా సరే ఇమ్రాన్ హష్మీతో కలిసి బీర్ తాగడానికి హాస్పిటల్ గది నుంచి బయటకు తప్పించుకొని వచ్చేవాడిని. అయితే రానురాను నా పరిస్థితి దిగజారిపోయింది. మందులు పనిచేయలేదు. ఆ స్థితిలో నన్ను చూసిన పేరెంట్స్ తట్టుకోలేక కలవడం మానేశారు. ఇంటర్నల్ గా బ్లీడింగ్ కావడంతో చాలా మంది రక్తదానం చేశారు. ఓసారి మహేష్ భట్ వచ్చి నా తలపై చేయి వేసి నిమిరాడు. అప్పుడు అతడి చేతులు వణికాయి.

అనుపమ్ ఖేర్ కూడా నన్ను కలవడానికి వచ్చారు. అప్పుడు నాకు పరిస్థితి చేయి దాటుతోందని అర్ధమైంది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఊపిరి ఆడక విలవిల్లాడాను. నాపై ఎలాంటి ట్రీట్మెంట్ కూడా పని చేయలేదు. మొదట్లో నా పరిస్థితి కూడా నా భార్యకు చెప్పలేదు. కానీ టీవీ ఛానెల్స్ ద్వారా ఆమె విషయం తెలుసుకుంది. ఆ తరువాత నాకు తోడుగా నిలిచింది.

టాటా మెమోరియల్‌ ఆస్పత్రికి షిఫ్ట్‌ చేసి నన్ను వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అప్పుడు నాకు ఒక బెడ్ కూడా దొరకలేదు. కానీ సునీల్ దత్ నాకోసం ఒక బెడ్ ఏర్పాటు చేశారు. అప్పుడు నాకు బెడ్ మీదే చికిత్స అందించారు. ఇండస్ట్రీలో ఉన్నందుకే అంత త్వరగా బెడ్ దొరికి ట్రీట్మెంట్ అందించగలిగారు. అదే వేరే వ్యక్తులైతే చాలా కష్టాలు పడేవారు” అంటూ చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus