స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు కాగా వీళ్లిద్దరి మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ప్రభాస్, అనుష్క వయస్సు పెరుగుతున్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు జోరుగా వినిపించాయి.
అయితే అటు ప్రభాస్ కానీ ఇటు అనుష్క కానీ ఈ వార్తలు నిజమని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ప్రభాస్, అనుష్క ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా పెళ్లి గురించి ప్రశ్నకు ఎదురవుతూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు ప్రభాస్, అనుష్క కూడా తమదైన శైలిలో సమాధానాలను ఇస్తూ ఉంటారు. అయితే రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవంటూ డైలాగ్ చెప్పగా ఆ డైలాగ్ హాట్ టాపిక్ అయింది.
ప్రభాస్ రియల్ లైఫ్ లోని ఒపీనియన్ ను సినిమా ద్వారా ఆ విధంగా చెప్పారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్ విడుదలైంది. పి మహేష్ బాబు డైరెక్షన్ లో కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించగా అనుష్క చెఫ్ గా కనిపించారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క స్లిమ్ లుక్ లో కనిపించారు. ప్రోమోలో జయసుధ “నా కూతురు ఏమైనా సామాన్యురాలు అనుకుంటున్నావా ఎప్పటికీ పెళ్లి చేసుకోదు పో ఇంకెవరినైనా చూసుకోరా” అనే డైలాగ్ ను అనుష్కను ఉద్దేశించి నవీన్ పోలిశెట్టికి చెబుతారు. సినిమాలో కావాలనే ఈ డైలాగ్ పెట్టారా? లేక అనుష్క పెళ్లి గురించి తన ఒపీనియన్ ను ఇలా చెప్పారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో అనుష్క ఖాతాలో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా