ఒంటరిగా ఏడ్చిన అనుష్క!

“సూపర్” సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన స్వీటీ అనుష్క టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. కెరీర్ లో పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసి పేరు తెచ్చుకుంది. అరుంధతి, రుద్రమ దేవి వంటి సినిమాలతో ఆమె ఇమేజ్ ని పెంచుకుంది. “గ్లామరస్ పాత్రలు పోషించడం కన్నా పీరియాడిక్ చిత్రాల్లో నటిచడం చాలా కష్టమయ్యేది. నటనకు ముందు సాధన చెయ్యాలి. ఎక్కువ సేపు షూటింగ్ లో పాల్గొనాలి. దీంతో ఒళ్లు హూనమయ్యేది.  నొప్పులతో నిద్ర వచ్చేది కాదు. ఇంట్లో వారికి చెబితే బాధ పడతారని ఒంటరిగానే ఏడ్చేదాన్ని” అని అనుష్క ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.

అయినా సినిమాలపై అభిమానం తగ్గలేదని, ఆ శ్రమతో పాటు  దర్శకుల ప్రోత్సాహం తనని ఈ స్థాయిలో ఉంచిందని వెల్లడించింది. ప్రస్తుతం స్వీటీ  సింగం 3, ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నబాహుబలి కంక్లూజన్ చిత్రం షూటింగ్లో నిన్నటి నుంచి అనుష్క పాల్గొంది.  ప్రభాస్, రానా, అనుష్కలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం రెండు నెలలుగా వ్యాయామం చేసి బరువు తగ్గింది. దేవ సేన గా మరో మారు అలరించడానికి సిద్ధమైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus