సమంతపై అనుష్క ‘నిశ్శబ్దం’ ఎఫెక్ట్!

పెళ్లి తర్వాత కూడా తనలోని గ్లామర్ యాంగిల్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది సమంత. ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. అయితే కథలో ఎంపిక విషయంలో మాత్రం సమంత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘యూటర్న్’ సినిమాతో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన సమంత.. ఇప్పుడు కూడా ఆ తరహా చిత్రాలపైనే మొగ్గు చూపుతుంది. ‘ఓ బేబీ’, ’96’ వంటి సినిమాలు సమంతకి మంచి పేరు తీసుకొచ్చాయి.

ఈ సినిమాల తరువాత సమంత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించనున్న బైలింగ్వల్‍ సినిమాలో నటించడానికి సమంత ఒప్పుకుంది. ఈ సినిమాలో మూగ యువతిగా సమంత నటించబోతుందని.. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని.. సమంతను ఇప్పటివరకు చూపించని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. దర్శకుడు అశ్విన్ గతంలో తాప్సీతో ‘గేమ్‍ ఓవర్‍’, నయనతారతో ‘మాయ’ వంటి హిట్ చిత్రాలను రూపొందించాడు.

దీంతో సమంత కూడా అశ్విన్ తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపించింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. దానికి గల కారణాలు క్లియర్ గా తెలియనప్పటికీ.. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా చూసిన తరువాతే సమంత ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ‘నిశ్శబ్దంలో’ అనుష్క చేసిన పాత్రకి తను చేయాలనుకున్న పాత్రకి దగ్గర పోలికలు ఉండడంతో సమంత తప్పుకుంది. కథ బ్యాక్ డ్రాప్, స్టోరీ కూడా ఇంచుమించుగా ఒకే విధంగా అనిపించిందట. సమంత తప్పుకోవడంతో అశ్విన్ ప్రాజెక్ట్ పూర్తిగా డ్రాప్ చేసేసి కొత్త కథతో తాప్సీని అప్రోచ్ అయినట్లు సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus