Anushka: అనుష్కతో రొమాన్స్.. మరోసారి క్యాన్సిల్!

  • May 8, 2021 / 07:48 PM IST

లేడి సూపర్ స్టార్ అనుష్క శెట్టి బిగ్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. మిగతా హీరోయిన్స్ లా కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న స్వీటీ కథలను కూడా విభిన్నంగా ఎంచుకుంటోంది. కథ ఎలాంటిదైనా సరే నటనకు స్కోప్ ఉండాలని అలాగే సినిమా మొత్తానికి పాత్ర హైలెట్ అయ్యేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఆమె నుంచి చివరగా వచ్చిన నిశ్శబ్దం సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ నవీన్ పొలిశెట్టితో చేయబోయే సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తోంది. ఇక ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే సినిమా షూటింగ్ ను మే నెలలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేయక తప్పడం లేదు.

ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్ట్ లోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ రొమాంటిక్ లవ్ స్టొరీని రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తెరకెక్కించనున్నాడు. ఈ కథలో హీరోయిన్ 40ఏళ్ళ మహిళగా హీరో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తాడని ఒక టాక్ అయితే వస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus