ప్రభాస్ తో తన కూతురు పెళ్లి వార్తలపై స్పందించిన అనుష్క తల్లి!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్కలు అభినందనలతో ఎంత ఆనందించారో.. ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల వల్ల అంతకన్నా ఎక్కువగా బాధపడ్డారు. బిల్లా, మిర్చి లో కలిసి నటించినప్పుడు తెలుగు మీడియా మాత్రమే ప్రభాస్ తో అనుష్కని ముడిపెట్టారు. బాహుబలి తర్వాత జాతీయ మీడియా సైతం కుప్పలుతెప్పలుగా వార్తలు ప్రచురించాయి. ఈ కథనాలను అనేక సార్లు అనుష్క, ప్రభాస్ ఖండించారు. అయినప్పటికీ గాసిప్స్ ఆగడం లేదు. దీంతో అనుష్క తల్లి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.  ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలని ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే.

వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి’’ అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే అనుష్క కూడా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు. దయచేసి రియల్ లైఫ్‌లో బాహుబలి, దేవసేన కెమిస్ట్రీని ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. అది స్క్రీన్ వరకూ మాత్రమే’’ అని తెలిపింది. సో ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి. భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాని హీరోగా నటించనున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus