చెఫ్ గా మారబోతోన్న అనుష్క శెట్టి?

గ్లామర్ బ్యూటీ స్వీటీ అనుష్క బాహుబలి సినిమా తర్వాత మళ్లీ చాలా బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత అందులో నటించిన వారు అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బిజీగా మారిపోయారు. కానీ అనుష్క శెట్టి మాత్రం ఆ తరహాలో కాకుండా చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఆమె నుంచి చివరగా వచ్చిన నిశ్శబ్దం సినిమా సైలెంట్ గానే వెళ్ళిపోయింది. ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు.

ఏదేమైనప్పటికీ అనుష్క తన సినిమాల విషయంలో మాత్రం చాలా సెలెక్టివ్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది పడితే అది చేయకుండా ఇక నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అందించాలి అని కూడా అనుకుంటుంది. ఇక పారితోషికం విషయంలో కూడా ఆమె ఎక్కువగా ఆశ పడడం లేదు అని సమాచారం. ఎందుకంటే అనుష్క శెట్టి బాహుబలి సినిమా తర్వాత దాదాపు పది ప్రాజెక్టు లకు పైగా రిజెక్ట్ చేసింది. ఒక వేళ ఆ ప్రాజెక్టులను ఓకే చేసి ఉంటే ఆమెకి దాదాపుగా 30 కోట్లకు పైగానే ఆదాయం వచ్చి ఉండేది.

ఇక అనుష్క ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకునే విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఒక ఇంటర్నేషనల్ చెఫ్ కనిపించబోతున్నట్లు సమాచారం. అనుష్క ఈ సినిమాలో 35 ఏళ్ల మహిళ గా కనిపించబోతుందట. ఇక పాతికేళ్ళ కుర్రాడు ఆమె ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది సినిమా సారాంశం అని తెలుస్తోంది. సినిమాలో మంచి కామెడీ అలాగే క్యూట్ రొమాన్స్ కూడా ఉంటుందట. మరి ఆ సినిమాతో అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus