మన్మధుడు2 తో కథనం పోటీ పడడంపై అనసూయ రెస్పాన్స్

నాగార్జున మీద అభిమానంతో నటిగా “క్షణం” లాంటి సూపర్ హిట్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. “సోగ్గాడే చిన్న నాయన” చిత్రంలో ఒక పాట మరియు ఒక రెండు సన్నివేశాల్లో కనిపించి అలరించింది అనసూయ. ఇప్పుడు అదే అనసూయ నాగార్జున తాజా చిత్రమైన “మన్మధుడు 2″తో పోటీపడడానికి సిద్ధమవుతుండడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే.. ఈ విషయమై స్పందించిన అనసూయ.. నాకు నాగార్జున గారంటే చాలా అభిమానం.. మన్మధుడు 2 ట్రైలర్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ నాగార్జున సార్, రాకుల్ ప్రీత్ & టీం. అలాగే.. ఆదేరోజు విడుదలవుతున్న మా సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అంతే కానీ.. “కథనం” సినిమా “మన్మధుడు 2″తో పోటీ పడడం లాంటిది ఏమీ జరగడం లేదు.

ఒక పక్క టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. అనసూయ సినిమాల్లో ప్రధాన పాత్రలు మరియు ప్రత్యేక పాత్రలు చేస్తూ బిజీగా ఉంటోంది. అయితే.. ఈమధ్యకాలంలో అనసూయ తన గ్లామర్ డోస్ ను కూడా కాస్త గట్టిగానే పెంచింది. కాస్త సన్నబడిన అనసూయ.. ఈమధ్య కొత్త ఫోటోషూట్స్ లో అందాల ప్రదర్శన కూడా మొదలెట్టింది. సొ ఇకపై అనసూయ సినిమా మీద కాస్త ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేయనుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus