ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టికెట్ రేట్ల ఇష్యు… మరియు బెనిఫిట్ షోలు క్యాన్సిలేషన్ వంటి విషయాలను ఖండిస్తూ డిస్ట్రిబ్యూటర్లు మొత్తానికి హైకోర్టుని ఆశ్రయించారు. ఏపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెం.35ని అక్కడి న్యాయస్థానం తీవ్ర స్థాయిలో వ్యక్తిరేకించి కొట్టిపారేసింది.టికెట్ రేట్లను పెంచుకోవాలన్నా.. తగ్గించుకోవాలన్నా థియేటర్ల యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకి హక్కు ఉందని ఆదేశించింది.2021 మార్చిలో ఉన్న టికెట్ రేట్ల ప్రకారం.. మసులుకోవచ్చని పిటిషనర్లకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పుని ఇచ్చింది. దీంతో పెద్ద సినిమాల నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకి పెద్ద రిలీఫ్ దక్కినట్టు తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ మరియు చిన్న సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ అవి ఏపిలో బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘లవ్ స్టోరీ’ ‘అఖండ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలు అక్కడ నష్టాలు పాలవ్వడానికి టికెట్ రేట్ల ఇష్యునే ప్రధాన కారణం అని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ పై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం వల్లనే ఇన్ని బయ్యర్లు, నిర్మాతలు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇప్పటివరకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి మంత్రి పేర్ని నానిని కలవడానికి దిల్ రాజు, దానయ్య వంటి వారు వెళ్లడం.. అనేక అవమానాలకు గురయ్యి తిరిగి రావడం జరిగింది. ‘కాఫీ టీ లు తాగడానికి వచ్చేళ్తున్నారు’ అనే విమర్శలు ఎదుర్కొని కూడా మన టాలీవుడ్ పెద్దలు నిరంతరం కృషి చేసి సాధించిన విజయం ఇదని ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. అయితే ఇంత చేసినప్పటికీ ఒమిక్రాన్ వంటి దాన్ని అడ్డం పెట్టుకుని..
అక్కడి ప్రభుత్వం 50శాతం ఆక్యుపెన్సీకి కుదించినా ఆశ్చర్యం లేదని, అయితే ఎన్ని ఎదురైనా పరిశ్రమని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. ‘అధికారం, ప్రతీకారం కన్నా.. నిజం,న్యాయం, ధర్మం’ గొప్పవని నిరూపించినందుకు గాను ఏపి హైకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు మన సినీ పెద్దలు. ఏదేమైనప్పటికీ ఇక నుండి విడుదలయ్యే పెద్ద సినిమాల కలెక్షన్ల పై పెద్దగా ప్రభావం ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!