ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సినిమా టికెట్ల కోసం ఓ పోర్టల్ ను ప్రవేశపెట్టనున్నారనే వార్త చాలా రోజుల క్రితమే వచ్చిన సంగతి తెలిసిందే. దీని పై తీవ్ర వ్యతిరేకత కూడా నెలకొంది. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను పంపిణీ చేసి ఆ వచ్చిన మొత్తం ప్రభుత్వం చేతిలో పెట్టడం.. అందులో తమ వాటా వచ్చేవరకు ఎదురుచూస్తూ కూర్చుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏమవుతారు అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారంటూ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.ఆయన మాట్లాడుతూ..
“సినీ పెద్దల సూచనను ఆధారం చేసుకునే ప్రభుత్వం ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. టాక్స్ ఎగ్గొట్టడం వంటివి కూడా జరుగుతున్న సందర్భాలను కూడా ప్రభుత్వం గమిస్తూ వస్తోంది. బ్లాక్ టిక్కెట్ల సంస్కృతిని అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ విధంగా అడుగులు వేస్తుంది. ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలి. ఆన్ లైన్ టికెటింగ్ పై అధ్యయనానికి ఓ కమిటీ కూడా ఏర్పాటుచేయడం జరిగింది.ఈ ఆన్ లైన్ టికెటింగ్ పై చాలా మంది అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు.ఆన్ లైన్లో టికెట్లు అమ్మవచ్చని గత ప్రభుత్వమే నిర్ణయించింది.
దీనికి తెలుగు ఫిలిం చాంబర్ కూడా ఆమోదం తెలిపింది. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్లు కూడా ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మితే బాగుంటుందని చెప్పారు’ అంటూ పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ లో వాస్తవం ఉందో లేదో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ టాపిక్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మరి పేర్ని నాని కామెంట్స్ కు చిరు, నాగ్ లు ఎలా స్పందిస్తారు అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!