ఆదిపురుష్ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. తాజాగా విడుదలైన ఆదిపురుష్ మూవీ రిలీజ్ ట్రైలర్ కు సైతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ ఏకంగా 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల సినిమాపై (Adipurush) అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ సినిమా తొలిరోజే 200 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారంటే ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో సులువుగా అర్థమవుతుంది. అయితే ఆదిపురుష్ సినిమాకు టికెట్ రేట్లు సైతం పెరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదని బోగట్టా. ఏపీలో మాత్రం సీఎం జగన్ ద్వారా అనుమతులు తెచ్చుకుని టికెట్ రేట్లు పెంచే అవకాశం అయితే ఉంది.
అయితే టికెట్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ సైతం పెరుగుతోంది. ప్రభాస్ పారితోషికం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు ఉండటం ప్రభాస్ కు ప్లస్ అవుతోంది. ఆయన కోరుకున్న స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధమవుతున్నారు.
ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్ ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు మరిన్నివిజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు భావిస్తున్నారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు