“అప్పట్లో”……ఇప్పటి “సింధూరమా”???

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని. చిన్న సినిమాలతో మంచి సక్సెస్ లు సాధిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మన నారా వారి కుమారుడు నారా రోహిత్. బాణం సినిమాలోనే తన న్యాచురల్ నటనను ప్రేక్షకులకు పరిచయం చేసిన నారా రోహిత్ మంచి హిట్స్ సాధించాడు. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో “అప్పట్లో ఒకడుండేవాడు” అన్న సినిమాతో వస్తున్నాడు….

ఈ సినిమా టీజర్ విడుదల కాక ముందు పెద్దగా అంచనాలు ఏమీ లేవు కానీ…టీజర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ టీజర్ చూస్తుంటే అప్పట్లో కృష్ణ వంశీ తీసిన “సిందూరం” సినిమా గుర్తొస్తుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అవును నక్సలిజం, మరియు పోలీసు వ్యవస్త గురించి కృష్ణ వంశీ సంధించిన బాణం మన సింధూరం. అయితే ఆ సినిమా ఎంతటి మంచి క్లాసిక్ గా మిగిలిపోయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టీజర్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. అయితే సింధూరం సినిమాలో పోలీసుల క్యారక్టర్లు నెగెటివ్ లో ఉంటాయి కాని.. ఇక్కడ రోహిత్ క్యారెక్టర్ మాత్రం హీరోయిక్ గా అదిరిపోయింది.

అంటే నక్సలిజంలోకి ప్రవేశించిన వారి నిజ జీవితపు అనుభవాలను నిజాయితీగా చూపిస్తూనే.. మరో ప్రక్కన పోలీసుల్లో ఉన్న హానెస్ట్ నేచర్ ను కూడా ఆవిష్కరించినట్లు ఉన్నారు..ఏది ఏమైనా…ఈ సినిమా టీజర్ చాలా ఎక్సయిట్మెంట్  ను పుట్టిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. మరి అసలే మన రోహిత్ తనకు ప్రియమైన రియలిస్టిక్ అండ్ డిఫరెంట్ కథను వెండితెరపైకి తెస్తున్నాడు అన్నట్లుగా ఉంది ఈ టీజర్. చూడాలి ఈ ఫార్మ్యాట్ ఎంతవరకూ సక్సెస్ ఇస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus