AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

ప్రముఖ సంగీత దర్శకుడు, ‘పెద్ది’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మ్యూజిక్‌ డైరక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌.. మరో వారం రోజుల్లో రామ్‌చరణ్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడా? అవుననే అంటున్నాయి ‘పెద్ది’ సినిమా వర్గాలు. అయితే అది ఎంత పెద్ద సర్‌ప్రైజ్‌ అనేది చెప్పలేం కానీ.. సర్‌ప్రైజ్‌ అయితే ఉంటుంది అని చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే వారంలో రెహమాన్‌ కన్సర్ట్‌ ఒకటి హైదరాబాద్‌లో జరగబోతోంది. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది.

AR Rahman

ఈ నెల 8న రామోజీ ఫిలింసిటీలో ఏఆర్‌ రెహమాన్‌ కన్సర్ట్‌ ఒకటి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆయనతోపాటు వర్ధమాన గాయనీగాయకులు వచ్చి ఆ కార్యక్రమంలో పాటలు పాడి అలరిస్తారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమాలోని మొదటి పాటను చూచాయగా వినిపిస్తారు అని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ‘కూలీ’, ‘ఓజీ’ సినిమా టీమ్స్‌ ఇలాంటి పనే చేసిన విషయం తెలిసిందే.

అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఓ ఈవెంట్‌లో ‘కూలీ’ సినిమా పాట పాడగా, తమన్‌ ఏకంగా ఓ ఈవెంట్‌ పెట్టి ‘ఓజీ’ సినిమాలో పాటను పాడి లాంచ్‌ చేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉంటుంది అని చెప్పలేం కానీ.. ‘పెద్ది’ పాటను అయితే రెహమాన్‌ అండ్‌ కో ప్రదర్శిస్తారు అని చెబుతున్నారు. ఆ రోజు ఈవెంట్‌లోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.

ఇక ‘పెద్ది’ విషయానికొస్తే.. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజే జాన్వీ కపూర్‌ను ఫియర్‌లెస్‌ అచ్చియమ్మగా ప్రేక్షకులకు పరిచయం కూడా చేశారు. ఆమె లుక్స్‌కి మంచి స్పందన కూడా వస్తోంది. ఇక గ్రామీణ నేపథ్యం ఉన్న ఆటలతో ముడిపడి ఉన్న బలమైన భావోద్వేగాల చుట్టూ ‘పెద్ది’ సినిమా తిరుగుతుంది. రామ్‌ చరణ్ పుట్టిన రోజు సందర్భంగతా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నెలకో అప్‌డేట్‌ ఇస్తూ ప్రచారం షురూ చేసిన టీమ్‌ జనవరి నుంచి పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేయడానికి ప్లాన్స్‌ చేసిందట.

‘తప్పు చేసినా క్షమిస్తాను.. కానీ అబద్దాలు సహించలేను’.. మాజీ ప్రియుడిపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus