మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్ దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇప్పటికీ ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. కానీ హీరోయిన్ గా ఆమె డిమాండ్ తగ్గింది. స్పెషల్ సాంగ్స్ లో చేసే ఆఫర్స్ కూడా ఎక్కువ రావడం లేదు. అందుకే ఓటీటీ ప్రాజెక్టుల్లో నటించడం మొదలు పెట్టింది. గ్లామర్ షోకి,లిప్ లాక్స్ కి, బెడ్ రూమ్ సీన్స్ కి ఎటువంటి లిమిట్స్ పెట్టకుండా వాటిల్లో నటించడం వల్ల తమన్నా బాగానే క్యాష్ చేసుకుంటూ వచ్చింది.
ఇదే క్రమంలో ఆమె విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. తర్వాత ఏమైందో ఏమో బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణాలు ఏంటన్నది ఇప్పటికీ రివీల్ చేసింది లేదు. అయితే ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం పై పరోక్షంగా స్పందించింది.
తమన్నా మాట్లాడుతూ.. “ప్రేమలో ఉన్నప్పుడు నేను ఎలాంటి తప్పునైనా క్షమిస్తాను. పొరపాటు జరిగితే సరిదిద్దడానికి ట్రై చేస్తాను. అందుకు ఎంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలో అంతా ఇస్తాను. అందుకు అడ్డుగా ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు సైతం అండగా నిలబడతాను. కానీ ప్రేమలో ఉన్నప్పుడు అబద్దాన్ని, మోసాన్ని మాత్రం సహించలేను” అంటూ చెప్పుకొచ్చింది.
తమన్నా మాటలను బట్టి చూస్తే.. విజయ్ వర్మ తమన్నాని అబద్దాలతో మభ్యపెట్టాలని చూసి ఉండొచ్చు. అందుకే అతన్ని దూరం పెట్టి ఉండొచ్చు అని స్పష్టమవుతుంది. వాస్తవానికి విజయ్ వర్మ కంటే కూడా తమన్నానే ఎక్కువ సంపాదించినట్టు ఇన్సైడ్ టాక్. అతను సక్సెస్ అయ్యింది లేదు. కానీ తమన్నా పీక్స్ చూసి వచ్చింది. బహుశా ఆమె స్టార్ డమ్ ను వాడుకుని.. విజయ్ వర్మ ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. అందుకే తమన్నా ఇతన్ని దూరం పెట్టి ఉండొచ్చు.