సాధారణంగా ఎంతో శాంతంగా ఉండే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆగ్రహానికి గురవడం హాట్ టాపిక్ గా మారింది. పాత పాటలను రీమిక్స్ చేయడం చాలా ఏళ్లుగా జరుగుతుండగా, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో మరింత ఊపందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాత గాయకుల వాయిస్‌లను వాడుకుంటూ రీమిక్స్‌లు చేస్తున్న ఈ ట్రెండ్‌ను రెహమాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న రీమిక్స్ ఒరవడిని చూస్తే ఏ కొత్తదనం లేదు, సృజనాత్మకత లేదని ఆయన అంటున్నారు.
‘‘ఒకసారి చేసిన పాటను మళ్లీ రీమిక్స్ చేయడంలో ఏం సరికొత్తగా ఉంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఆ పాటలను తిరిగి మలచడం వారికి హక్కు లేదని.. కనీసం అనుమతి కూడా అడగకపోవడం బాధాకరం’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ ‘‘సంవత్సరాల కిందటి సూపర్ హిట్ పాటను కాపీ కొట్టి, రీమిక్స్ చేశామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుపడదగ్గ విషయం’’ అన్నారు. ఈ పాటల ఒరిజినల్ కంపోజర్స్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రీమిక్స్ చేయడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, ఇప్పుడు సంగీతంలో ఏఐ టెక్నాలజీ వాడకం మరింత పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రెహమాన్ హెచ్చరించారు. రెహమాన్ ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా సమాధానాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇళయరాజా కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయ్యారు.
‘‘ఒరిజినల్ సృష్టికర్తల క్రియేటివిటీని కాపీ కొట్టడం సరైన పద్ధతి కాదు. నైతిక సమస్యలు తలెత్తుతాయి, పైగా ఇది సంగీత రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తెస్తుంది’’ అని రెహమాన్ మరో కామెంట్ చేశారు. రీమిక్స్ పాటలను అందరికీ అందజేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు, ఒరిజినల్ సంగీత దర్శకుల నుంచి అనుమతి తీసుకోవడం లేదన్న విమర్శలు రెహమాన్ చేస్తున్నందుకు మద్దతు లభిస్తోంది. ‘‘నేను రీమిక్స్‌లను సమర్థించను, నా పాటలను రీమిక్స్ చేయవద్దు’’ అని రెహమాన్ స్పష్టంగా తెలిపారు.