Ar Rehaman: ఏఆర్ రెహమాన్ కొత్త కారు ఖరీదెంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!

  • September 23, 2023 / 05:33 PM IST

సౌత్ ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్ ఒకరనే సంగతి తెలిసిందే. ఏ ఆర్ రెహమాన్ పారితోషికం ప్రస్తుతం 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశరు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏఆర్ రెహమాన్ కార్లను ఎంతగానో ఇష్టపడతారని సమాచారం అందుతోంది. ఏఆర్ రెహమాన్ కారు ఇటలీ బ్రాండ్ కారు కాగా లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కారును ఆయన కొనుగోలు చేశారు.

ఈ కారు ఖరీదు 4 కోట్ల 18 లక్షల రూపాయలు అని సమాచారం. అత్యాధునిక ఫీచర్లు ఉండటం వల్లే ఈ కారు కొనుగోలుపై ఏఆర్ రెహమాన్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. చెన్నైలోని డిటైలింగ్ స్టూడియో దగ్గర ఈ కారు కనిపించగా ఈ కారు ఎంతో బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 3.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు ఈ కారు వేగం పుంజుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల దగ్గర ఈ కారు ఉండగా తాజాగా ఈ జాబితాలో ఏఆర్ రెహమాన్ చేరారు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సైతం (Ar Rehaman) ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నాలుగేళ్ల పాటు కష్టపడ్డారని సమాచారం అందుతోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

2025 సంవత్సరంలో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ మార్కెట్ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus