ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఇప్పట్లో ఒక సినిమా వారం రోజులు నిలబడటమే గొప్ప విషయం అయిపోయింది. చిన్న సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాగోకపోతే 2వ రోజు పక్కన పెట్టి.. 2వ షోకే దుకాణం సర్దేసే పరిస్థితి. అలాంటిది ఓ చిన్న సినిమాకి 10వ రోజు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ అరుదైన సంఘటన ‘అరి’ విషయంలో జరిగింది.

ARI

అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది.అక్టోబర్ 10న రిలీజ్ అయిన ‘అరి’ దీపావళి సినిమాలతో పాటు రన్ కొనసాగిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. తొలి రోజు సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ‘అరి’ గురించి బాగానే మాట్లాడుకున్నారు.

ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే కదిలించింది అని చెప్పాలి. కొత్త సినిమాలు వచ్చినా నిలదొక్కుకుంది. 10వ రోజు ‘అరి’కి థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు జయ శంకర్ ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి టైంలో మేకర్స్ కనుక మరో అడుగు ముందుకేసి ప్రమోషన్ చేస్తే.. కచ్చితంగా ఇంకాస్త బెటర్ రిజల్ట్ ఉంటుంది.

అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ తో ‘పేపర్ బాయ్’ వంటి సెన్సిబుల్ మూవీ తీసిన జయ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మనిషిలో ఉండే 6 నెగిటివ్ షేడ్స్.. వారి పతనానికి ఎలా కారణమవుతాయి? వాటి నుండి ఎలా బయటపడాలి? అనే సెన్సిబుల్ పాయింట్ తో ‘అరి’ చిత్రాన్ని రూపొందించారు జయ శంకర్.

దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus