Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

‘పేపర్ బాయ్’ తో టాలెంటెడ్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు జయశంకర్. 2018 లో వచ్చిన ఆ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే వెంటనే జయశంకర్ నుండి మరో సినిమా రాలేదు. అతని 2వ వ సినిమాకి ఏకంగా 7 ఏళ్ళు టైం పట్టింది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎట్టకేలకు అతను త్వరలోనే 2వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు ‘అరి’.

Ari

అనసూయ, సాయి కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


ఆయన జయశంకర్ 7 ఏళ్ళు గ్యాప్ తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తుంది. ‘పేపర్ బాయ్’ తో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2వ సినిమా కచ్చితంగా ఆడియన్స్ గుండెల్లో కొన్నేళ్ల పాటు నిలిచిపోవాలనే సంకల్పంతో ఆయన ఒక లోతైన అంశాన్ని ఎంచుకున్నారు.’మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులు (అరిషడ్వర్గాలు)’ అనే వినూత్న కాన్సెప్ట్‌ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం నిశిత పరిశోధన చేశారు. అంటే కేవలం స్క్రిప్ట్ రాయడం మాత్రమే అని కాకుండా పురాణ గ్రంథాలు, ఇతిహాసాలు ఆధారంగా అరిషడ్వర్గాలపై లోతైన పరిశోధన చేశారట.ఇందులో భాగంగా రమణ మహర్షి వంటి ఆధ్యాత్మిక గురువుల వద్దకు వెళ్లి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు అలాగే ఇంకా అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి అక్కడ చాలా మంది గురువులను కలిసి ప్రామాణికమైన జ్ఞానాన్ని పొందినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే మార్గాలపై ఆధ్యాత్మిక కోణంలో అధ్యయనం చేశారట. వీటికోసమే ఆయన 6 ఏళ్ళు టైం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అలాగే ‘అరి’ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, ఏకంగా 25 అవార్డులను గెలుచుకుంది.కంటెంట్‌, క్వాలిటీ అంత బాగా వచ్చాయట. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు ‘అరి’ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు.

ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ‘చిన్నారి కిట్టయ్య’ పాటకి మంచి అప్రిసియేషన్ వచ్చింది.ఇక ‘సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus