‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జ హీరోగా రూపొందిన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వరప్రసాద్ నిర్మించారు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా శ్రీయ కీలక పాత్ర పోషించింది. అలాగే మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అతని పెర్ఫార్మన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. దర్శకుడు కూడా మనోజ్ క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశాడు అని చెప్పాలి. అలాగే సాంపతి యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
మిడ్ రేంజ్ సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ఇందులో వి.ఎఫ్.ఎక్స్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అందుకే ‘మిరాయ్’ పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.. ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ అయ్యింది. అయితే అక్టోబర్ 10 నుండే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది ‘మిరాయ్’.
అందుకే 4 వారాల థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే ఓటీటీకి వచ్చేస్తుందన్న మాట. ఎంత ఎర్లీగా ఓటీటీకి వచ్చేస్తున్నప్పటికీ.. ‘మిరాయ్’ చిత్ర బృందాన్ని మాత్రం ఒక విషయంలో అంతా అభినందించాల్సిందే. ఎందుకంటే సినిమాకి టికెట్ హైక్స్ వంటివి అప్లై చేసి ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టలేదు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అందువల్ల ఆడియన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ముందుకు వచ్చారు. సినిమా సక్సెస్ కి అదే కారణం అని చెప్పాలి.