అల్లు అర్జున్ కి అచ్చిరాలేదు.. మరి వరుణ్ కి వర్కవుటవుతుందా

ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క క్యారెక్టర్ రోల్స్ తోపాటు నెగిటివ్ రోల్స్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు యాక్షన్ కింగ్ అర్జున్. తాజాగా ఆయన తెలుగులో మరో క్యారెక్టర్ రోల్స్ ఒకే చేశాడని తెలుస్తోంది. ఇటీవలే “ఎఫ్ 2″తో మంచి హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రంగా కిరణ్ కొర్రపాటి అనే యువ దర్శకుడి నేతృత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఒకే చేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అర్జున్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకొన్నారని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అతడి కోచ్ గా అర్జున్ కనిపించనున్నాడట. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ తో కలిసి “నా పేరు సూర్య” సినిమాలో అర్జున్ నటించి ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అది వేరే విషయం అనుకోండి. వరుణ్-అర్జున్ ల కాంబినేషన్ చూడడానికి కూడా బాగుంటుంది కానీ.. అర్జున్ కి ఎందుకో తెలుగులో మల్టీస్టారర్ పెద్దగా అచ్చిరాలేదు. నితిన్ తో “శ్రీ ఆంజనేయం, లై” అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” వంటి సినిమాలు చేదు అనుభవాలనే మిగిల్చాయి. మరి వరుణ్ తో కలిసి నటించబోయే సినిమాతోనైనా ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus