‘ది లెజెండ్’.. అనే పాన్ ఇండియా చిత్రం జూలై 28న .. ఈరోజు విడుదలైంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక్కడి వరకు ఓ పద్దతిగా చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది.ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్ శరవణన్ లుక్స్ గురించి. 51 ఏళ్ళలో హీరోగా నటిస్తూ రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి ‘ది లెజెండ్’ అనే చిత్రాన్ని అతను నిర్మించాడు కాబట్టి.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌స్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నిటి మీద ట్రోలింగ్ జరిగింది. రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి ఎవరు చూస్తారు అని సినిమా తీశారు? డబ్బుంటే సినిమా హీరో అయిపోవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అంటూ ఈ సినిమా గురించి,అరుళ్ శరవణన్ గురించి విపరీతమైన నెగిటివ్ కామెంట్లు మొదలయ్యాయి. అయితే రూ.80 కోట్లు పోయాయి అన్నది నిజమే. కానీ అతను రూ.100 కోట్ల లాభం పొందాడు అనే విషయం చాలా మందికి తెలీదు.
అదెలా అనే డౌట్ అందరికీ రావచ్చు.ఇక్కడే మన ఆలోచనలకు ఒక వ్యాపారస్థుడి ఆలోచనకి తేడా ఉంటుంది. అరుళ్ శరవణన్ స్టోర్స్ లో దుస్తులు, బంగారం వంటివి అమ్ముతూ ఉంటారు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వచ్చాయి అంటే భారీ మొత్తం కమర్షియల్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అరుళ్ శరవణన్ తో పాటు హీరోయిన్లను తీసుకురావాలి. వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా..! ఇప్పుడు దేశం మొత్తం తన స్టోర్స్ ను ప్రారంభించి వాటికి ప్రమోషన్ చేయాలి అంటే అతను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అందుకే పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా తీశాడు. ఇందులో అన్నీ వాళ్ళ బ్రాండ్ కాస్ట్యూమ్సే వాడారు..! సినిమా ఆడకపోయినా ఇతని గురించి చాలా పబ్లిసిటీ జరిగింది. ఇతని వ్యాపారాల గురించి కూడా జనాలకు తెలిసింది. ఇదే పబ్లిసిటీ అతను విడిగా పబ్లిసిటీ చేయించుకోవాలి అంటే.. ‘ది లెజెండ్’ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే కూడా ఎక్కువవుతుంది. ఒక రూపాయిని సామాన్యుడు చూసే పద్ధతి వేరు.. వ్యాపారస్తుడు చూసే పద్ధతి వేరు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!