ప్రభుత్వ నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేసిన అరవింద్ స్వామి

  • December 14, 2016 / 12:52 PM IST

సౌత్ ఇండియన్ దేశభక్తి సినిమాల ప్రస్తావన వస్తే అందిరికీ గుర్తొచ్చే చిత్రం రోజా. తమిళంలో రూపొందిన ఈ మూవీ దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ అనువాదమై సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో హీరోగా నటించిన అరవింద్ స్వామికి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఆయన వెల్లడించిన అభిప్రాయంతో వ్యతిరేకులను సొంతం చేసుకుంటున్నారు. హీరో పాత్రలను వదిలి విలన్ గా మెప్పిస్తున్న తమిళ నటుడు సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడాలన్న సుప్రీం కోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

“దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రదేశాల్లో, క్రీడా కార్యక్రమాలలో జాతీయగీతం పాడితే అర్థం ఉంది. థియేటర్లలో పాడడం అర్థంలేని పని” అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని చెప్పారు. అరవింద్‌స్వామి మాటలపై కొంతమంది విరుచుకు పడుతున్నారు. అతనికి దేశభక్తి లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అరవింద్‌స్వామి క్షమాపణ చెప్పి, తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అరవింద్ స్వామి విలన్ గా నటించిన ధృవ మూవీకి అన్నిచోట్లా మంచి స్పందన వస్తోంది. స్టైలిష్ విలనిజం తో ఆకట్టుకున్న ఆయనకు వివిధ పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus