పుష్ప సినిమాలో విలన్ ని కన్ఫార్మ్ చేస్తున్నారు..!

  • January 31, 2021 / 02:13 PM IST

అల్లు అర్జున్ సుకుమార్ చేస్తున్న పుష్ప సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ తెగ లైక్స్ చేసేస్తున్నారు. షేర్లు చేసేస్తున్నారు. రీసంట్ గా అందుతున్న మేటర్ ఏంటంటే, మన పుష్ప రాజ్ కి విలన్ ని సెట్ చేసేశారట. నిజానికి ఈ సినిమాలో విలన్ పై చాలా పేర్లు వినిపింంచాయి. ఫస్ట్ లో విజయ్ సేతుపతిని తీస్కున్నారు. కానీ , కొన్ని కారణాల వల్ల సేతుపతి తప్పుకున్నాడు. తర్వాత బాబీ సింహా పేరు వినిపించింది.

కానీ ఫైనల్ అవ్వలేదు. జగ్గుభాయ్ నే కన్ఫార్మ్ చేశారు అన్నారు. కానీ అది కూడా అఫీషియల్ గా వినిపించలేదు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో ఆర్య పేరు పుష్ప టీమ్ లో వినిపించింది. కానీ అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే, ఇప్పుడు రీసంట్ గా ఈయనే కన్ఫార్మ్ చేశారు రాస్కోండి అంటూ ఒక న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఆర్యని ఫైనల్ చేసినట్లుగా ఎప్పట్నుంచో టాక్ అనేది వచ్చింది. కానీ అఫీషియల్ గా మాత్రం పోస్టర్ రిలీజ్ చేయలేదు.

ఇప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారని అంటున్నారు. గతంలో ఆర్య అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. ఆ సినిమాలో కూడా బన్నీకి విలన్ గా నటించాడు ఆర్య. ఇప్పుడు కూడా పుష్పరాజ్ కి విలన్ గా నటించబోతున్నాడని అంటున్నారు. దీనికోసం ఆర్య బాడీ బిల్డింగ్ కూడా చేశాడట. మరి అఫీషియల్ గా ఈ పేరు ఎనౌన్స్ చేసేవరకూ చూడాల్సిందే. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus