దమ్ము కొట్టి బాలయ్య డైలాగ్ చెప్పిన కుర్ర హీరోయిన్!

తమిళ బ్యూటీ ఆషిమా నర్వాల్ ‘నాటకం’ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ‘జెస్సీ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించే ఛాన్స్ ఈమెకి వచ్చింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ భామ తెలుగులో మరో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే ఉంటుందో. తాజాగా ఆషిమా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆషిమా సిగరెట్ కలుస్తూ బాలయ్య డైలాగ్ చెప్పింది.

బాలయ్య డైలాగ్స్ లో ఫేమస్ అయిన ”డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ఇఫ్ యు ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యు. ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్‌.. ఐయామ్ ద ట్రూత్” అనే డైలాగ్ ని దమ్ము లాగించేస్తూ తన స్టైల్ లో చెప్పేసింది ఆషిమా. ఈ వీడియో షేర్ చేస్తూ సిగరెట్ తాగడం ప్రమాదకరమని హెచ్చరిక కూడా జారీ చేసింది. తాను నటిస్తోన్న తెలుగు సినిమాలో పాత్ర కోసం ఇలా సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమెకి క్లాసులు తీసుకుంటున్నారు. మరికొందరు ఈ పోస్ట్ వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆషిమా మాత్రం ఇప్పటివరకు ఈ కామెంట్స్ పై రియాక్ట్ అవ్వలేదు.


టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus