‘బిగ్ బాస్3’ విన్నర్ రాహుల్ లిప్ లాక్ వీడియో వైరల్..!

పైన హెడ్డింగ్ చూడగానే అందరూ రాహుల్ … పునర్నవి లిప్ లాక్ వీడియో అనుకుంటారేమో. కానీ ఆమెతో కాదు రాహుల్ రొమాన్స్ చేసింది. ‘బిగ్ బాస్2’ కంటెస్టెంట్ నందినీ రాయ్ తో..! అవును మీరు వింటున్నది నిజమే..! రాహుల్ మంచి సింగర్ అన్న సంగతి తెలిసిందే. అతనికి ముందు నుండీ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఆయిన తర్వాత ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.

మరో కాంటెస్టెంట్ పునర్నవి తో రొమాన్స్ … బయటకి వచ్చాక వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారు అనే వార్తలు ఇతన్ని మరింత పాపులర్ చేసాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇతను అప్పట్లో చేసిన ఓ ఆల్బమ్ కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసాడు. అందులో నందినీ రాయ్ కూడా ఉంది. ఏకంగా పాటకి డ్యాన్స్ చెయ్యడంతో పాటు … రాహుల్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. అందులో ఘాటు లిప్ లాక్ కూడా ఉంది.

ఈ వీడియోని నందినీ రాయ్ తో చూస్తూ సరదాగా నవ్వుకుంటున్న సందర్భం మనం చూడొచ్చు. ఈ వీడియోకి మరో ‘బిగ్ బాస్ 3’ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి ఘాటు కామెంట్స్ పెట్టింది. ‘ఇది నేను చూడలేదే… రాహుల్ వీడియో అంటే ఆ మాత్రం రొమాన్స్ ఉంటుంది’ అంటూ కామెంట్ చేసింది. దీనికి రాహుల్ .. ‘నేను చచ్చిపోతా’ అని రిప్లై ఇచ్చాడు. ‘మినిమం ఉంటాయి కదా … నీ వీడియోస్ లో’ అంటూ మళ్ళీ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.


అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus