Ashu Reddy: ప్యారిస్‌లో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డుచెప్పదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటేనే అరాచకం అర్థం చేసుకోవచ్చు. జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషు.. అభిమానులు తన నుండి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని మరీ గ్లామరస్ ఫొటోలతో వాళ్లడిగన అందాల విందు చేస్తుంటుంది. బుల్లితెర మీద షోలతో, సినిమాలతో బిజీగా ఉండే అషు నటించిన ‘ఫోకస్’ అనే తెలుగు మూవీ ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేసింది అషు.. తను హీరోయిన్ అయితే వెండితెర మీద రచ్చ వేరేలా ఉంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు కానీ అషు మాత్రం సినిమాల మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదనే అనిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా ప్యారిస్ ట్రిప్ వేసింది. అక్కడ తీసుకున్న స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసి నెట్టింట హీట్ పెంచుతుంది. బ్యాగ్రౌండ్‌లో ఈఫిల్ టవర్ వెలుగుల్లో మెరిసిపోయింది.. గ్లామర్ ఒలకబోయడంలో గ్రామర్ ఎక్కడ నేర్చుకుందో అనేలా ఉన్నాయి అషు లేటెస్ట్ పిక్స్.. వీపు అందాలు చూపుతూ, ప్యారిస్ ప్రకృతికి తాను పరవశించిపోతున్న ఫీలింగ్‌ని తన పిక్స్ చూసే కుర్రకారుకి అందిస్తూ హల్ చల్ చేస్తోంది.. సిటీ ఆఫ్ లవ్ అండ్ లైట్స్ అంటూ అషు రెడ్డి షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. పారిస్‌లో బారిష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

1

2

3

4

5

6

7

8

9

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus