చిరంజీవితో సినిమాపై స్పందించిన అశ్వినీదత్

జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ.. చిరంజీవి కెరీర్ లో ఇవన్నీ సూపర్ హిట్స్. ఈ చిత్రాలను వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మించారు. మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావాలని మెగా అభిమానులు కోరుకున్నారు. కానీ చిరు రాజకీయాల్లోకి వెళ్లడం… అశ్వినీదత్ సినిమా నిర్మాణానికి దూరంగా ఉండడంతో అభిమానుల కల నెరవేరలేదు. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 మూవీతో ఫామ్లోకి వచ్చారు. మహానటి మూవీతో అశ్వినీదత్ మళ్ళీ విజయ బాటలోకి వచ్చారు. దీంతో వీరికలయికలో సినిమా రాబోతోందని కొన్ని రోజులుగా వార్తలు షికారు చేశాయి. మెగాస్టార్ కోసం నాగ్ అశ్విన్ కథ రెడీ చేసాడని టాక్ వినిపించింది.

ఈ విషయంపై అశ్వినీదత్ స్పందించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో అశ్వినీదత్ మాట్లాడుతూ “మెగాస్టార్ తో సినిమా చేయాల్సి వస్తే అది మాకు అత్యంత సంతోషకరమైన విషయం. ఇప్పటికే ఆయనతో సినిమాలు చేసాం. ప్రస్తుతం మెగాస్టార్ తో మా బ్యానర్ లో సినిమా ఉంటుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరు… సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ రెండు కంప్లీట్ అయ్యేసరికి ఏడాది పైనే పడుతుంది. సో ఆ తర్వాతే నెక్స్ట్ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus