పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు సరైన అవగాహన లేకపోవడం వల్లే తప్పు చేశాడని ఎక్కువమంది చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సైతం పల్లవి ప్రశాంత్ చేసింది తప్పే అయినా క్షమించి వదిలేయాలని కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచినా ఆ ఆనందం కొంత సమయం కూడా లేకుండా చేశారని ప్రశాంత్ తండ్రి తెలిపారు.
అశ్విని శ్రీ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారని తెలిసిందని ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ట్రోఫీ గెలిచాడని పాపం ప్రశాంత్ ఏం చేశాడని ఆమె చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ ను చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు ఫ్యాన్స్ వచ్చారని అశ్విని శ్రీ పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పు అని పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడని అశ్విని శ్రీ కామెంట్లు చేశారు.
పల్లవి ప్రశాంత్ కప్ గెలిచి ఒక్కరోజైనా కాకముందే ఆ సంతోషం లేకుండా చేశారని ఆమె తెలిపారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైలులో వేశారంటే బాధ ఉందని అశ్విని శ్రీ వెల్లడించారు. అది అతని తప్పు కాదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె తెలిపారు. బిగ్ బాస్ హౌస్ బయట జరిగిన గొడవలో అశ్విని శ్రీ కారు అద్దాలు కూడా పగిలిపోయిన సంగతి తెలిసిందే.
అశ్విని శ్రీ (Ashwini Sree) కామెంట్ల విషయంలో పోలీసుల నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో చూడాలి. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ వచ్చినా వివాదాలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.