Raghava Lawrence: కొత్త ఇమేజ్ కోసం లారెన్స్ ప్లాన్!

  • June 25, 2021 / 01:12 PM IST

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు. ఒక్క మలయాళం తప్పించి దాదాపు సౌత్ లో అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. బాలీవుడ్ లో ‘కాంచన’ రీమేక్ తో గతేడాది దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లారెన్స్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. లారెన్స్ హీరోగా ‘అధిగారం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ధనుష్ హీరోగా ‘అసురన్’ లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్స్ లో భాగం అవ్వడంతో ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా చాలా టెరిఫిక్ గా ఉంది. యాప్రాన్ వేసుకొని చేతితో కత్తి పట్టుకొని రక్తపు మరకలతో నడిచొస్తున్న లుక్ ను విడుదల చేశారు. లారెన్స్ లుక్ కూడా కొత్తగా ఉంది.

ఈ సినిమా తనకొక కొత్త ఇమేజ్ ను తీసుకొస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నాడు లారెన్స్. దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.


తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus