Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘రణస్థలి’ ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకొస్తుంది : అశ్వినీదత్

‘రణస్థలి’ ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకొస్తుంది : అశ్వినీదత్

  • November 24, 2022 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రణస్థలి’ ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకొస్తుంది : అశ్వినీదత్

సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై హీరో ధర్మ,హీరోయిన్స్ అమ్ము అభిరామి,చాందిని రావు,నటులు సమ్మెట గాంధీ,బెనర్జీ,దిల్ రమేష్, RRR చంద్రశేఖర్ , మధుమణి,ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం, తేజ నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అశ్వినిదత్, హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ..విజయ పిక్చర్స్ అధినేత వెంకటరత్నం గారు ఆ సంస్థను చాలా సక్సెస్ ఫుల్ గా 50 సంవత్సరాలు నడిపిన గౌరవ ప్రదమైన వ్యక్తి,.అయన మాకు గురుతుల్యులు వంటి వారు. వారి అబ్బాయి విష్ణు విజయవాడ లో కన్స్ట్రక్షన్ బిజినెస్ రంగంలో ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు సినిమా రంగంలొకి రావడం చాలా సంతోషంగా ఉంది.తను తీసిన రణస్థలం సినిమా ట్రైలర్, టీజర్ లలోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఇంద్ర సినిమా గుర్తుకు తెస్తుంది.. దర్శకుడు, కెమెరామెన్ లు ఈసినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. నటీ నటులు కూడా బాగా నటించారు. ఇందులో కొన్ని సీన్స్ చూసిన తరువాత షాకింగ్ గా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది .ఈ సినిమాతో మొదలు పెట్టిన విష్ణు వెనుతిరిగి చూడకుండా ఏకాదాటిగా 50 సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

వీడియో బైట్ ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి పరశురాం శ్రీనివాస్ లాంటి కొత్త డైరెక్టర్ రావడం చాలా సంతోషంగా ఉంది. “రణస్థలి ” సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. అంటున్నారు. ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అయ్యి. టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది.అంతా కొత్త వారిని పెట్టుకొని దర్శక, నిర్మాతలు అద్భుతంగా తీశారు.ఈ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చి మంచి ప్రమోషన్ చేస్తే బిగ్ హిట్ అవుతుందని భావించి వారికి సపోర్ట్ గా నిలిచాను. నా సొంత సినిమాకు కూడా ఇంత ఎమోషన్ గా మాట్లాడలేదు.ఈ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.కొత్త కంటెంట్ ఉన్న సినిమా, కొత్త యాక్టర్స్ కావాలనుకునే వారంతా ఈ నెల 26 న వస్తున్న “రణస్థలి” సినిమాను కచ్చితంగా చూడాల్సిందే అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ.. ట్రైలర్, విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది.సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అన్నారు. ఈ సినిమా విడుదల అయిన తరువాత బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసే దర్శకుడు పరశురాం ఈ సినిమా తర్వాత గొప్ప దర్శకుడు అవుతాడు. ఇంతకుముందు తనతో సినిమా చేయ్యాలని ఉన్నా అది మిస్సయింది. ఆకాష్ పూరి ఇది తన సినిమా కాకున్నా ఈ సినిమా చూసి ప్రమోషన్ చేయడం గ్రేట్. ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర నిర్మాతలు విష్ణు, జ్యోతి లు మాట్లాడుతూ..డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి సినిమాలో మంచి  పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులు ఇలా అన్ని ఎలిమెంట్స్  వున్న సినిమా ఇది. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్ లు మీతోనే ఉంటాయి.ఈ నెల 26 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

చిత్ర దర్శకుడు పరశురాం శ్రీనివాస్ మాట్లాడుతూ..పూరి గారు నా కు గురువు. ఆయనే నా ఇన్స్పిరేషన్. ఆకాష్ కు మంచి స్క్రిప్ట్ దొరికితే గొప్ప నటుడు అవ్వడమే కాకుండా వారి తండ్రి పూరి జగన్నాథ్ గారు అని కాకుండా ఆకాష్ తండ్రి పూరీ గారు అనుకునేలా చేస్తారు. నిర్మాతలు ఈ సినిమా క్వాలిటీ కొరకు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. రొటీన్ గా వచ్చే కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.ఈ సినిమా కొరకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు.ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ. .ఇందులో నేను హీరో ఫాదర్ గా నటించాను . ఈ సినిమాను నిర్మాతలు విష్ణు, జ్యోతి లు అద్భుతంగా తీశారు. పరుశరామ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి కొత్త రైటర్, డైరెక్టర్ అయినా తను రాసుకునే సినిమాలో కథ, కథనం బాగుంటుంది. బాలాజీ కెమెరామెన్ బాగా తీశాడు. నేను ఈ సినిమా చూసిన తరువాత థ్రిల్ ఫీలయ్యను.ఈ నెల 26 న వస్తున్న “రణస్థలి” సినిమా అఖండ అంత పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర హీరో ధర్మ మాట్లాడుతూ..ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కారణమైన దర్శకులు పరుశరాం గారికి థాంక్స్ చెపుతున్నాను. ఈ సినిమా కొరకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. అలాగే జ్యోతి గారు మమ్మల్ని తమ సొంత బిడ్డల్లాగ చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి సినిమాలో హీరో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు

చిత్ర హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెపుతున్నాను. మా సినిమా ట్రైలర్, టీజర్ అందరికీ నచ్చినట్టే సినిమా కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

మరో హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. ఇందులో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకే గూస్ బమ్స్ వస్తున్నాయి.ఈ సినిమా కొరకు నేను చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

కెమెరామెన్ జాస్టి బాలాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ పరుశరాం నేను చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్.. షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ అయిన మేము ఇప్పుడు సినిమా తీసే స్థాయి కి వెళ్ళాము. నటీ నటులు చాలా బాగా నటించారు. కేశవ్ కిరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాను కొత్త వారితో తీసినా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆలా అనిపించదు. ప్రేక్షకులు థియేటర్స్ ఈ సినిమాను చూసిన తరువాత వారంతా కచ్చితంగా కొత్త అనుభూతితో బయటకు వచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

ఆకాశవీదుల్లో హీరో గౌతమ్ మాట్లాడుతూ.. పరశురాం శ్రీనివాస్ నాకు రెండు సంవత్సరాలనుండి తెలుసు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరితో పరిచయం ఉంది. దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు చాలా చక్కటి సినిమాను అందిస్తున్నారు. ట్రైలర్ లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాను ఫోన్, లాప్టాప్ లలో చూసే సినిమా కాదు. థియేటర్స్ లలో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. ఈ నెల 26 న అందరూ థియేటర్స్ కు వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aswinidath
  • #Ranasthali

Also Read

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

related news

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

trending news

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

35 mins ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

3 hours ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

8 hours ago

latest news

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

17 hours ago
Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

17 hours ago
తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కి కూడా థియేటర్స్ ఇస్తారు.. కానీ తమిళంలో నా లాంటి హీరోలకు థియేటర్లు ఇవ్వరు!

తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కి కూడా థియేటర్స్ ఇస్తారు.. కానీ తమిళంలో నా లాంటి హీరోలకు థియేటర్లు ఇవ్వరు!

17 hours ago
ARI: కంటతడి పెట్టించేలా ‘అరి’ దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్

ARI: కంటతడి పెట్టించేలా ‘అరి’ దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్

22 hours ago
Pvr Inox: టేబుల్‌ మీద ఫుడ్‌.. ఎదురుగా బిగ్‌ స్క్రీన్‌.. డైన్‌ ఇన్‌ సినిమా వచ్చేస్తోంది!

Pvr Inox: టేబుల్‌ మీద ఫుడ్‌.. ఎదురుగా బిగ్‌ స్క్రీన్‌.. డైన్‌ ఇన్‌ సినిమా వచ్చేస్తోంది!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version