నడిరోడ్డులోనే రాకేష్ మాస్టర్ మూడో భార్యపై చేయి చేసుకున్న మహిళలు?

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాకేష్ మాస్టర్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రాకేష్ మాస్టర్ మరణం తర్వాత ఆయన మూడో భార్యపై కొందరు మహిళలు నడిరోడ్డు పైన ఆమెపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన ఇద్దరు భార్యలకు దూరంగా ఉన్నటువంటి రాకేష్ మాస్టర్ లక్ష్మీ అనే మహిళకు దగ్గరయ్యారు. ఆమె తనతో పాటు ఉంటూ తనకు కావలసిన అన్ని అవసరాలను తీర్చడంతో ఈయన తనని మూడో భార్యగా ప్రకటించారు. అయితే తాజాగా రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మి స్కూటీపై పంజాగుట్ట ఏరియాలో వెళుతున్నారు అయితే ఈమెను లల్లి అనే ఒక యూట్యూబర్ అడ్డుకున్నారు.

లల్లి అనే యూట్యూబర్ తో పాటు మరొక ముగ్గురు మహిళలు తనని అడ్డుకొని తనపై చేయి చేసుకోవడమే కాకుండా నడిరోడ్డుపై తనని చితకబాదారు.ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరిని స్టేషన్ కి తరలించారు. అయితే యూట్యూబర్ లల్లి లక్ష్మీపై చేయి చేసుకోవడానికి గల కారణాలను తెలిపారు.లల్లి అనే యూట్యూబర్ మాట్లాడుతూ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్ అయినటువంటి తన కుమార్తె గురించి చాలా అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు చేశారు.

ఇలా తన కుమార్తె గురించి మాట్లాడటంతోనే తాను తనపై దాడికి ప్రయత్నించానని తెలిపారు. అయితే లక్ష్మి కూడా లల్లి గురించి మాట్లాడుతూ తనని యూట్యూబ్ ఛానల్ నుంచి తప్పుకోవాలని లల్లి బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. నన్ను బెదిరించడమే కాకుండా తనని అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే తనపై దాడి చేశారు అంటూ ఫిర్యాదు చేసింది దీనితో పోలీసులు వీరిద్దరి ఫిర్యాదులను తీసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus