సెలబ్రిటీలకు సైతం తప్పడం లేదుగా..!

యువ వైద్యురాలైన ప్రియాంక రెడ్డి హత్య విషయంతో తెలుగురాష్ట్రాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అతి క్రూరంగా ఆమె పై అత్యాచారం చేసి.. ఆ తరువాత అత్యంత క్రూరంగా పెట్రోల్ – కిరోసిన్ పోసి దహనం చేసిన సంఘటన పై అందరూ ఎంతో ఆవేదనతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో స్త్రీలకు భద్రత లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వారి ఆవేశాన్ని తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం సామాన్య స్త్రీల పైనే కాదు సెలెబ్రిటీలను కూడా కొందరు కుర్రాళ్ళు లైంగికంగా వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఓ మాజీ ‘బిగ్ బాస్’ కంటెస్టంట్… గురువారం నాడు తెల్లవారు జామున కేరళలోని.. అళువ నగరంలో బస్సులో ప్రయాణిస్తుండగా .. ఆమె పైబెర్త్ లో ఉన్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట. ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడానికి ప్రయత్నించడంతో ఆమె గట్టిగా అరిచిందట. దీంతో డ్రైవర్ బస్సు ఆపేశాడని తెలుస్తుంది. నిందుతుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాలని ఆమె చెప్పడంతో.. ఆ వ్యక్తి తను ఏమీ చేయలేదనితప్పించుకునే ప్రయత్నం చేశాడట. ఆ తరువాత ‘ఆమెకు క్షమాపణలు చెప్పి.. పోలీసులకు మాత్రం చెప్పొద్దంటూ వేడుకున్నాడని తెలుస్తుంది. కానీ ఆమె కాంప్రమైజ్ కాకుండా .. కొట్టక్కళ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారట.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus